

లిజోస్ వాచ్ అవుట్ ఫర్ ద బిగ్ గరల్స్
PRIMETIME EMMYS® 3X గెలిచారు
ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - పూర్తిగా ఆ స్నేహితురాలు కావడం
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి24 మార్చి, 202248నిమిమల్టీ ప్లాటినం మ్యూజిక్ ఐకాన్ లిజ్జో 2022 టూర్‌కు వెళుతూ, తన తదుపరి బిగ్ గరల్ డాన్సర్ల కోసం వెతుకుతుంది. పదమూడు మంది ఆశావహులు కాలిఫోర్నియాలోని హాలీవుడ్‌కు చేరుకుంటారు, అయితే కేవలం పది మంది మాత్రమే బిగ్ గరల్స్ హౌస్‌లో లిజ్జో బృందంతో శిక్షణ పొంది, ఆమెతో పాటు ప్రదర్శన ఇచ్చే అవకాశం కోసం ఆడిషన్ ఇస్తారు.ఉచితంగా చూడండిసీ1 ఎపి2 - హెచ్‌బీసీవైఓయూ బ్యాండ్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి24 మార్చి, 202249నిమిపది మంది టూర్ ఆశావహులు బిగ్ గరల్స్ హౌస్‌కు చేరుకుంటారు, అయితే వాళ్లు లిజ్జోతో టూర్‌కు వెళ్లే అవకాశం కోసం ఆడిషన్ ఇస్తుండగా, ఒకరి చీలమండ గాయం వారికి ముప్పు కలిగిస్తుంది. ఉదయం లాంగ్‌స్టన్ యూనివర్శిటీ మార్చింగ్ బ్యాండ్‌తో డాన్సర్‌లను మేల్కొల్పుతారు. వారు తమ మొదటి ఈవెంట్‌లో "గుడ్ యాజ్ హెల్"ను ప్రదర్శిస్తారు. లిజ్జో, లెజెండరీ కొరియోగ్రాఫర్ తనీషా స్కాట్‌లు వాళ్ల జడ్జీలుగా ఉంటారు.ఉచితంగా చూడండిసీ1 ఎపి3 - ఒంపుసొంపులు, ఆత్మవిశ్వాసం
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి24 మార్చి, 202249నిమితన కొత్త సింగిల్ "రూమర్స్" విడుదలయ్యాక, తన బృందాన్ని చౌంటా వాన్‌తో డాన్స్ రిహార్సల్ చేయిస్తున్నప్పుడు లిజ్జో వారిని ఆశ్చర్యపరుస్తుంది. వీరు తమ ఒంపుసొంపులను స్వీకరించేలని, ఆమె బాడీ మూవ్‌మెంట్ ఎక్స్‌పర్ట్ రషీదా ఖాన్‌బేతో కలిసి ఒక ఇంద్రియ సంబంధిత తరగతిని ఏర్పాటు చేస్తుంది. మిస్సీ ఎలియట్ "వి రన్ దిస్" కోసం అమ్మాయిలు తమ స్వంత మ్యూజిక్ వీడియోలను సృష్టించి, అందులో నటించబోతున్నారని లిజ్జో ప్రకటిస్తుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి4 - నేకెడ్
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి24 మార్చి, 202248నిమిఈ ఎమోషనల్ ఎపిసోడ్‌లో లిజ్జో అమ్మాయిలను నగ్న ఫోటో షూట్‌లో తమ ఒంపుసొంపులను ప్రదర్శించడానికి, తమ శరీరం పట్ల చిన్న చూపును పోగొట్టుకోవడానికి ప్రోత్సహిస్తుంది, కానీ అందరు డాన్సర్లు తమ దుస్తులు విప్పడానికి సిద్ధంగా ఉండరు. వారికి తమ చర్మాన్ని బహిర్గతం చేయడం సౌకర్యంగా ఉండదు. పెద్ద కార్యక్రమం కోసం లిజ్జో కొత్త సింగిల్ "నేకెడ్"కు వాళ్లంతా లిరికల్ కొరియోగ్రఫీ నేర్చుకుంటారు.ఉచితంగా చూడండిసీ1 ఎపి5 - గోడపైన అద్దం
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి24 మార్చి, 202251నిమిస్టేజ్పై గరల్స్ ఎలా ఉంటారో చూడటానికి స్టేజ్ పర్సోనా ఈవెంట్ కోసం వారితో కలిసి పని చేయడానికి లిజ్జో తన టీమ్‌ను పంపుతుంది. లిజ్జో "ట్రూత్ హర్ట్స్"లో ప్రదర్శన చేస్తున్నప్పుడు ప్రతి అమ్మాయి తమ రూపాన్ని మార్చుకుని, తమను తాము అధిగమించాలని కోరుకుంటుంది, కానీ హౌస్‌లో ఉద్రిక్తతలు వేదికపై ప్రభావం చూపుతాయి. లిజ్జోకు ఒక నిజం వెల్లడించాక, ఒక ఊహించని నిర్ణయం గరల్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.ఉచితంగా చూడండిసీ1 ఎపి6 - మరోసారి చెప్పు
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి24 మార్చి, 202245నిమిఏ వేదికపైనైనా ప్రదర్శన చేయడం ప్రమాదకరం, అయితే తారాజువ్వలు, స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు అది మరింత ప్రమాదకరం. ఎలిమెంట్స్ ఈవెంట్‌లో "జ్యూస్"కు డాన్స్ చేయడంతో లిజ్జో బిగ్ గరల్స్‌ను పరీక్షిస్తుంది. వేదికపై ఏదైనా జరగవచ్చు, దాన్ని ప్రదర్శనకారుడు తట్టుకోగలగాలి. అందరు అమ్మాయిలు ప్రదర్శించలేరని తనీషా స్కాట్ ఆందోళన చెందుతున్నప్పుడు, వారిలో నలుగురు తమ ప్రాణాల కోసం డాన్స్ చేస్తారు.ఉచితంగా చూడండిసీ1 ఎపి7 - ధైర్యంగా జీవితాన్ని మార్చుకో
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి24 మార్చి, 202246నిమిబొన్నారూ కొన్ని రోజులే ఉండగా, లిజ్జో ఒక కఠినమైన సత్యాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. బిగ్ గరల్స్‌లో కొందరు ఆమెతో వేదికపై ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధం కాలేకపోవచ్చు. తమ శక్తిని పెంచుకోవడానికి సవాలు ఎదురవుతుంది, గరల్స్ వేదికపై జీవితానికి సిద్ధమవుతారు. చివరి రిహార్సల్‌లో అద్భుతమైన బిగ్ గరల్స్‌లో ఎవరు తనతో పాటు బొన్నారూలో ఉంటారో, ఎవరుండరో నిర్ణయించడానికి లిజ్జో, తనీషాలు ఆమెతో చేరతారు.ఉచితంగా చూడండిసీ1 ఎపి8 - అద్భుతం
మద్దతిచ్చే పరికరాల్లో చూడండి24 మార్చి, 202246నిమిఒక ఊహించని సంఘటనతో లిజ్జో బొన్నారూ అరంగేట్రం ఛిన్నాభిన్నం అయ్యాక, తర్వాత ఏమి జరుగుతుందో అని బిగ్ గరల్స్ ఆలోచిస్తారు. పంచ్‌లతో రోల్ చేస్తూ, లిజ్జో గరల్స్‌కు వాళ్ల కొత్త ప్రదర్శన ప్రణాళికను తెలియజేస్తుంది. ఆమె పర్యటనలో ఏ గరల్ తనతో పాటు ఉంటుంది, ఎవరు ఉండరనే దానిపై ఆమె తుది నిర్ణయం తీసుకుంటుంది, అందుకని గరల్స్ చివరిసారిగా తమ సత్తా చూపించాల్సిన సమయం ఆసన్నమవుతుంది.ఉచితంగా చూడండి