ఎపిసోడ్‌లు
సీ1 ఎపి1 - మంచి మేజిస్ట్రేట్
7 డిసెంబర్, 202255నిమిమేజిస్ట్రేట్ నినో స్కోటెల్లారో మారియానో సురోను పట్టుకోవటానికి ప్రయత్నిస్తుంటాడు. ఎన్నో ఏళ్ళుగా పరారీలో ఉన్న కోసా నోస్ట్రా మాఫియా ముఠా అధినేతకోసం నినో కొన్నేళ్ళుగా వెతుకుతున్నాడు. ఈసారి అతనిని దాదాపుగా పట్టుకునేదాకా వెళతాడు. ఆఖరి నిమిషంలో విఫలమవుతాడు. ఆ కోపంలో, దీనికి కారణం వ్యవస్థలు సురోకు సాయం చేయటమేనంటూ నినో విమర్శలు చేస్తాడు. ఈ ఆరోపణ అతనికే తగులుతుంది. అతని సర్వస్వమూ అతనికి దూరం అవుతుంది.ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదుసీ1 ఎపి2 - రహస్య గూఢచారులు
7 డిసెంబర్, 202257నిమినినో స్కోటెల్లారో చనిపోయాడని అతని భార్య లువి, చెల్లెలు లియోనార్డాతో సహా అందరూ భావిస్తారు. నిజానికి, నినో ఒక మారుమూల గ్రామంలో బతికే ఉంటాడు. సాల్వతోరె త్రాచినా అనే ఒక మాఫియా డాన్‌కు అతిథిగా ఉంటాడు. అతను ఒక్కడే నినోకు సాయం చేయగలిగిన వ్యక్తి. వాళ్ళిద్దరి మధ్య అనూహ్యరీతిలో ఏర్పడిన ఒక పొత్తుతో మేజిస్ట్రేట్ నినో స్కోటెల్లారో మాఫియా సభ్యుడు బల్దూచ్చో రెమోరాగా మారిపోతాడు.ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదుసీ1 ఎపి3 - నువ్వు ఏమైనా తక్కువా...
7 డిసెంబర్, 202250నిమిస్వేచ్ఛ లభించటంతో, గత జీవితం గురించి నినో ఆలోచించకుండా ఉండలేకపోతుంటాడు. కానీ, పోగొట్టుకున్నదానికి ప్రతీకారం తీర్చుకోవాలనే కాంక్ష పైచేయి సాధిస్తుంది. దీనితో ఒక మాఫియా వ్యక్తి అనే కొత్త అవతారంలో మరో కుటుంబంలో సభ్యుడుగా మారతాడు: సురోకు ప్రత్యర్థులైన త్రాచినా అనే క్షీణించే కుటుంబంలో. వారితో కలిసి ప్రతీకారానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. కానీ సురోపై యుద్ధానికి వారికి ఆయుధాలు కావాలి.ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదుసీ1 ఎపి4 - ప్రకృతిని ఆపలేరు
14 డిసెంబర్, 202256నిమిడాన్ సాల్వతోరె నియంత్రణ కోల్పోతాడు. మిత్రులెవరూ లేకుండా మిగిలిపోయిన నినో, సముద్రపు తాబేలును కాపాడటం చూస్తూ కొత్త వ్యూహానికి రూపకల్పన చేస్తాడు. తెరెసాను ఆమె కుటుంబానికి అప్పగించటం ద్వారా సురోకు దగ్గరవ్వాలన్నది ఆ వ్యూహం. తండ్రి చేతిలో కిడ్నాప్ అయిన కొడుకు మారియానుచ్చోను వెతకటం కోసం తెరెసా ఆ ప్రతిపాదనను అంగీకరిస్తుంది. అయితే, వేరే విధంగా ఆలోచించే ఆ రెండు కుటుంబాల వల్ల వారి ఆశలు అడియాశలు అవుతాయి.ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదుసీ1 ఎపి5 - ఒక వెలుగు కనబడింది
14 డిసెంబర్, 202247నిమివావ్టర్ వరల్డ్‌లో ఏర్పడిన అధికార శూన్యత నేపథ్యంలో నినో కొత్త వ్యూహం రూపొందిస్తాడు, మాఫియా చరిత్రలో ఎన్నడూ వినని ఆ వ్యూహం: ప్రజాస్వామ్యం. త్రాచినా కుటుంబం డబ్బు సంపాదించటానికి తెరెసా ఉపాయం చెబుతుంది. డిజిటల్ కాలానికి తగ్గట్టుగా మామూళ్ళు వసూలు చేయటం. క్రిస్టమస్ రాబోతోంది. ఏడాది మొత్తంలో అత్యధిక వ్యాపారం జరిగే ఈ కాలాన్ని అవకాశంగా మలుచుకుని త్రాచినా కుటుంబం అత్యధికంగా మూమూళ్ళు వసూలు చేయగలుగుతుందా?ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదుసీ1 ఎపి6 - ఏ క్షణాన
14 డిసెంబర్, 202250నిమిసురో దాక్కున్నచోటును కనిపెట్టడానికి మాఫియా కుటుంబాలు చేపట్టిన మారణహోమం తీవ్రంగా ఉంటుంది. దీంతో సురోను పట్టుకోవడానికి ఒక మేజిస్ట్రేట్ లాగా కాకుండా మాఫియా వ్యక్తిలాగా పని చేయాలని నినోకు అర్థమవుతుంది. కోసా నోస్ట్రా కుటుంబాల మద్దతుతో సురోను పట్టుకోవడానికి నినో చివరి వ్యూహాన్ని అమలు చేస్తాడు. అయితే తన చెల్లెలు, భార్య కూడా సురోను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని నినోకు తెలియదు.ఈ వీడియో ప్రస్తుతం అందుబాటులో లేదు